Xiaomi Mi 12: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 895 ప్రాసెసర్‌..!

Xiaomi Mi 12: మొబైల్‌ తయారీ కంపెనీ ఎంఐ రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. అత్యాధునిక..

Xiaomi Mi 12: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 895 ప్రాసెసర్‌..!
Mi 12
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2021 | 4:56 AM

Xiaomi Mi 12: మొబైల్‌ తయారీ కంపెనీ ఎంఐ రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. అత్యాధునిక ఫీచర్లతో ఫోన్‌లను తయారు చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన విషయాలు బయటకు లీకయ్యాయి. ఇప్పటివరకు విడుదల కానీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగానే ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనుందట. క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో విడుదలైన మొదటి ఫోన్ ఎంఐ 11. గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ ఫోన్ మార్కెట్లో విడుదలైంది.

స్పారో న్యూస్ కథనం ప్రకారం.. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను టీజ్ చేశారు. దీని ప్రకారం ఎంఐ 12 రూపకల్పన ఇప్పటికే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఎస్ఎం 8450 మోడల్ నంబర్ ఉన్న ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ మధ్యే విడుదలైన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ గురించి క్వాల్‌కాం ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతోపాటు 200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్‌ను ఇందులో అందించనున్నట్లు ట్వీట్ చేశారు.

ఈ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌లో 16 ఇన్ 1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని అందించనున్నట్లు సమాచారం. 12 మెగాపిక్సెల్ ఇమేజెస్‌ను పెద్ద పిక్సెల్స్‌లో ఇవి అందించనున్నారు. ఫోన్ కెమెరా మాడ్యూల్‌పై ఒలింపస్ లోగో కూడా ఉండే అవకాశం ఉంది. ఎంఐ 12లో ముందువైపు సెల్ఫీల కోసం పంచ్ హోల్ కటౌట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

అయితే షియోమీ మాత్రం ఈ ఎంఐ 11 స్మార్ట్ ఫోన్ తర్వాత వెర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే క్వాల్‌కాం కూడా స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ గురించి ఇంకా వెల్లడించలేదు. ప్రముఖ టిప్‌స్టర్ ఎవాన్ బ్లాస్ కూడా ఈ క్వాల్‌కాం ప్రాసెసర్ గురించి ట్వీట్ చేశారు. ఎస్ఎం8450 అనే కోడ్‌నేమ్‌తో క్వాల్‌కాం తర్వాత తరం ప్రాసెసర్ రానుందని తెలుస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ ఎక్స్65 5జీ మోడెంనె అందించనున్నారు. ఎంఐ 12 మొబైల్‌ ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇవీ కూడా చదవండి:

Xiaomi mi11: షియోమి విడుదల చేసిన మి11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రికార్డ్ సేల్స్..ఏడు రోజుల్లో అమ్మకాల లెక్క ఎంతంటే..

Whats App: వాట్సప్ ప్రైవసీకి పెద్ద పీట..వ్యూ వన్స్ పేరిట కొత్త ఫీచర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..