AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలు కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం.. నలుగురు కరోనా రోగులు మృతి.. ఆక్సిజన్‌ అందకే చనిపోయారంటున్న బాధిత బంధువులు

Kurnool K. S. Care Hospital: కర్నూలు జిల్లా కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. అయితే.

కర్నూలు కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం.. నలుగురు కరోనా రోగులు మృతి.. ఆక్సిజన్‌ అందకే చనిపోయారంటున్న బాధిత బంధువులు
Subhash Goud
|

Updated on: May 01, 2021 | 4:21 PM

Share

Kurnool K. S. Care Hospital: కర్నూలు జిల్లా కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్‌ అందక చనిపోయారంటూ మృతుల బంధువులు ఆరోపిస్తుండగా, ఇతర కారణాలతో చనిపోయారని ఆస్పత్రి యజమాని డాక్టర్‌ శాస్త్రి చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా ఆస్పత్రి యాజమాన్యం కరోనా చికిత్స అందిస్తుందని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్‌ కొరత ఉన్న విషయం వాస్తవమేనని, అందుకే రోగులను ఇతర ఆస్పత్రికి వెళ్లాలని సూచించామని ఆయన చెబుతున్నారు. కోవిడ్‌ ఆస్పత్రి కోసం అనుమతి కోరామని, ఇంకా రాలేదని ఆస్పత్రి యజమాని డాక్టర్‌ శాస్త్రి తెలిపారు. అయితే బాధిత బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రి ఎండీని ప్రశ్నిస్తున్నారు. ఆక్సిజన్‌ అందకపోవడంతోనే కరోనా పేషెంట్లు మృతి చెందారని పోలీసుల ముందు బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి ముందు రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.

కాగా, కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. సరైన సమయానికి ఆక్సిజన్‌ అందక చాలా మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ఒక వైపు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

ఇవీ చదవండి:

Etela Rajender: మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం.. వైద్య ఆరోగ్యశాఖను కేసీఆర్‌కు బదిలీ.. గవర్నర్‌ ఆమోదం

WHO Warning: భారత్‌లో ఉన్న పరిస్థితులు ఎక్కడైనా జరగవచ్చు.. ఐరోపా దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం