మూడురోజులుగా బోరు బావిలోనే బాలుడు.. అపస్మారక స్థితిలోకి..!

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారైలోని ఓ బోరు బావిలో రెండేళ్ల బాలుడి బావిలో పడి మూడు రోజులవుతున్నా.. ఇంకా బయటకు తీయలేదు. మూడు రోజులుగా బాలుడు బోరు బావిలోనే ఉన్నాడు. బాలుడిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. సిబ్బందికి.. బాలుడు సరిగా స్పందిచకపోవడంతో.. వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడికి నిరంతంర ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. తాజాగా.. స్థానిక పరిస్థితిని సమీక్షించిన డిప్యూటీ సీఎం […]

మూడురోజులుగా బోరు బావిలోనే బాలుడు.. అపస్మారక స్థితిలోకి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:49 PM

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారైలోని ఓ బోరు బావిలో రెండేళ్ల బాలుడి బావిలో పడి మూడు రోజులవుతున్నా.. ఇంకా బయటకు తీయలేదు. మూడు రోజులుగా బాలుడు బోరు బావిలోనే ఉన్నాడు. బాలుడిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. సిబ్బందికి.. బాలుడు సరిగా స్పందిచకపోవడంతో.. వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడికి నిరంతంర ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. తాజాగా.. స్థానిక పరిస్థితిని సమీక్షించిన డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం. బాలుడిని బయటకు తీసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అక్టోబర్ 25 సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవ శాత్తూ 600 అడుగుల మూతలేని బోరుబావిలో పడిపోయాడు బాలుడు. మొదట బాలుడు 35 అడుగుల లోతులోనే ఉన్నాడని భావించినప్పటికీ తాజాగా.. 100 అడుగుల కిందకు జారిపోయినట్లు సహాయక సిబ్బంది చెప్పారు. మద్రాస్ ఐఐటీకి చెందిన నిపుణులతో సహా ఆరు బృందాలు బాలుడిని బయటకు తీసేందుకు.. తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందరూ.. ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.

మరోవైపు మూడు రోజుల్లో సుతిజ్‌ 100 అడుగుల లోతులోకి జారిపోవడంతో బాలున్ని బయటకు తీసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేవు. బోరుబావికి సమాంతరంగా భారీ గొయ్యి తవ్వే క్రమంలో పెద్దపెద్ద బండరాళ్లు అడ్డు వస్తుండటంతో కష్టతరంగా మారింది. రెవెన్యూ.. పోలీసు… అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు రాత్రి, పగలు అనే తేడాలేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి సహాయక పనులు క్లిష్టంగా మారాయి. అటు తమ పిల్లాడు ప్రాణాలతో బయటపడతాడా లేదా అని సుజిత్‌ తల్లిదండ్రు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.