వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి మా ముందు హాజరు కావాలి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో స్పీడ్ పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించింది. వారం రోజుల్లో తమ ముందు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ […]

వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి మా ముందు హాజరు కావాలి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో స్పీడ్ పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించింది. వారం రోజుల్లో తమ ముందు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్నారు.

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న అభియోగంపై ఈడీ విచారణ చేస్తోంది. స్టీఫెన్‌ సన్‌కు ఇవ్వజూపిన డబ్బులు ఎక్కడివని ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Published On - 8:27 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu