పారికర్ బెడ్‌రూం నుంచే అమిత్ షా తీసుకెళ్లారు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాఫెల్ రగడ ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా గోవాలో వేడి రాఫెల్ రాజుకుంది. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తన దాడిని కొనసాగిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై సంచలన ఆరోపణలు చేసింది. గత శనివారం గోవా పర్యటనకు వచ్చిన అమిత్ షా, సీఎం మనోహర్ పారికర్ బెడ్ రూం నుంచి రాఫెల్‌ ఒప్పంద పత్రాలను పట్టుకెళ్లారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేంద్ర దేశ్ ప్రభు అన్నారు. రాఫెల్ పత్రాలు […]

పారికర్ బెడ్‌రూం నుంచే అమిత్ షా తీసుకెళ్లారు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాఫెల్ రగడ ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా గోవాలో వేడి రాఫెల్ రాజుకుంది. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తన దాడిని కొనసాగిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై సంచలన ఆరోపణలు చేసింది. గత శనివారం గోవా పర్యటనకు వచ్చిన అమిత్ షా, సీఎం మనోహర్ పారికర్ బెడ్ రూం నుంచి రాఫెల్‌ ఒప్పంద పత్రాలను పట్టుకెళ్లారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేంద్ర దేశ్ ప్రభు అన్నారు.

రాఫెల్ పత్రాలు పారికర్ బెడ్‌రూంలో ఉన్నాయని స్వయంగా గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రానె చెబుతున్నట్టు ఉన్న ఓ ఆడియో టేప్ ఇటీవలే సంచలనం సృష్టించింది. ఈ ఆడియో టేప్ దృష్ట్యానే కాంగ్రెస్ అమిత్ షాను టార్గెట్ చేసింది. అయితే తన నివాసంలో రాఫెల్ ఫైళ్లు ఉన్నాయన్న ఆరోపణలను పారికర్ కొట్టిపారేశారు.

Published On - 7:54 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu