AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్క్ వెబ్ లో యధేచ్చగా డ్రగ్స్ దందా..!

అక్రమార్కులకు అడ్డదారులు ఎన్నెన్నో. మత్తులో మునిగిన అంథకారులు డార్క్ వెబ్ సైట్ల వైపు ఆకర్షితులవుతున్నారు. డ్రగ్స్ సరఫరాలపై పోలీసులు డేగకన్ను వేస్తుండడంతో కొత్త మార్గాల్లో డ్రగ్స్ సరఫరాకు ఎంచుకుంటున్నారు. ఇందు కోసం డార్క్ సైట్లను వాడుకుంటున్నారు.

డార్క్ వెబ్ లో యధేచ్చగా డ్రగ్స్ దందా..!
Balaraju Goud
|

Updated on: Jul 27, 2020 | 5:54 PM

Share

అక్రమార్కులకు అడ్డదారులు ఎన్నెన్నో. మత్తులో మునిగిన అంథకారులు డార్క్ వెబ్ సైట్ల వైపు ఆకర్షితులవుతున్నారు. డ్రగ్స్ సరఫరాలపై పోలీసులు డేగకన్ను వేస్తుండడంతో కొత్త మార్గాల్లో డ్రగ్స్ సరఫరాకు ఎంచుకుంటున్నారు. ఇందు కోసం డార్క్ సైట్లను వాడుకుంటున్నారు.

డార్క్‌ వెబ్‌ అనేది ఓ చీకటి ప్రపంచం. సాధారణంగా ఎవరైనా గూగుల్‌ క్రోమ్‌, మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌లాంటి బ్రౌజర్లను వినియోగిస్తారు. ఇందుకు భిన్నంగా డార్క్‌ వెబ్‌.. చీకటి ప్రపంచంలో టోర్‌ బ్రౌజర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ అసాంఘికశక్తులకు నేరగాళ్లకు తోడ్పాటునందిస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చిరిస్తున్నాయి. ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తే గానీ వాటిని వినియోగించేందుకు వీలుండదు.

డార్క్ వెబ్ ద్వారా మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు, మానవ అక్రమరవాణా వంటి చీకటి సామ్యాజ్యం కోరలు చాస్తున్నాయి. టెక్నికల్ లోపాలను ఆసరా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రాక్సీ సర్వర్ల ఆధారంగా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇక్కడ ఆర్థిక లావాదేవీలన్నీ బిట్‌కాయిన్‌ విధానంలోనే జరుగుతుండడం కొసమెరుపు. దీంతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్లూస్ ను దొరకకుండా కేటుగాళ్లు జాగ్రత్త పడుతున్నారు. మొదటే కొంత డబ్బు చెల్లించి బిట్‌కాయిన్లను కొనుగోలు చేస్తారు. దీంతో తనకు కావల్సిన ట్రాన్సక్షన్ల చేస్తూ బిటికాయిన్ రూపంలోనే చెల్లింపులు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో చిక్కిన డ్రగ్స్‌ ముఠా వ్యవహారాలపై విచారణ జరుపుతున్న పోలీసులు ఈ విషయాలను గుర్తించారు. చీకటి ప్రపంచంలో విహరిస్తున్నట్లు గతంలో పట్టుబడ్డ కెల్విన్‌ ఉదంతంతోనే వెలుగుచూసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఓ కీలక నిందితుడిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం విచారించిపుడు ఈ వ్యవహారం బహిర్గతమైంది.

బిట్‌కాయిన్ల రూపంలో డార్క్‌ వెబ్‌లో ఆర్డర్లు ఇచ్చి విదేశాల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మత్తు మందు సరఫరాకు అవసరమైన అన్ని టెక్నిక్ లను ఉపయోగిస్తూ చీకటి దందాను యధేచ్చగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా పోస్టల్‌ స్టాంపుల రూపంలో ఉండే ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌నే తెప్పిస్తున్నట్లు గుర్తించారు. విమానాశ్రయాల్లో కొరియర్‌ పార్సిళ్లను కస్టమ్స్‌ అధికారులు పరిశీలించే సమయంలో అనుమానం రాకుండా పక్కాగా ప్యాకింగ్ ఉండాలే చూసుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టడంతో కొంత వరకు తగ్గుమొఖం పట్టింది. అయితే, వినియోగదారులే నేరుగా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా డ్రగ్‌ డీలర్ల కదలికలు తగ్గిపోవడంతో వినియోగదారులు డార్క్‌ వెబ్‌లో ఆర్డర్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాల రాకపోకలు తగ్గినా కార్గో సేవలు కొనసాగుతుండడంతో కొరియర్ల రూపంలో డ్రగ్స్ సరఫరాకు ఎంచుకుంటున్నారని ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు.