Air Taxi: జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్ ట్యాక్సీ సేవలు!
గుంటూరు కేంద్రంగా మ్యాగ్నమ్ వింగ్స్ అభివృద్ధి చేసిన ఎయిర్ ట్యాక్సీలు వాణిజ్య ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. రహదారి, రైలు రద్దీని తగ్గించి, చౌక ఆకాశ మార్గాన్ని అందించే లక్ష్యంతో అభిరామ్ నేతృత్వంలో ఈ ట్యాక్సీలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన ఈ ట్యాక్సీలు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి, త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

రవాణా మార్గాలు అన్నీ రద్దీగా మారిపోతున్నాయి. రోడ్డు, రైలు మార్గాలు పూర్తి సామర్ధ్యంతో నడుస్తున్న ప్రయాణాలు మాత్రం సాఫిగా సాగటం లేదు. ఈ క్రమంలోనే అత్యంత చౌకగా ఆకాశ మార్గం అందుబాటులోకి రావాలంటూ అనేక మంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ ట్యాక్సీల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు కేంద్రంగా మ్యాగ్నమ్ వింగ్స్ రెండేళ్ల క్రితమే ఎయిర్ ట్యాక్సీల తయారీని చేపట్టింది. ప్రాథమిక దశల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మ్యాగ్నమ్ వింగ్స్ ఎండి అభిరామ్ వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్దమయ్యారు. ఇద్దరూ కూర్చొనే వీలున్నా ఎయిర్ ట్యాక్సీ రూపొందించిన అభిరామ్ కేంద్ర ప్రభుత్వ పాలసీ కోసం ఎదురు చూస్తున్నారు.
కేంద్రం అనుమతి లభించగానే అకాశ మార్గంలో మ్యాగ్నమ్ వింగ్స్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరనున్నాను. ఒకరు ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీకి మరిన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అభిరామ్ తెలిపారు. ఎయిర్ ట్యాక్సీ ప్రయాణిస్తున్న సమయంలో ఒత్తిడికి లోనైనప్పుడు ట్యాక్సీ నిర్మాణం ఎలా స్పందిస్తుంది, ఎలా నియంత్రణలో ఉండగలుగుతుందో పరీక్షించినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో తాము తయారు చేసిన ఎయిర్ ట్యాక్సీ డిజైన్ అన్ని పారామీటర్స్ ను అందుకుందన్నారు. అదేవిధంగా హార్ట్ ల్యాండింగ్ టెస్ట్ ను కూడా చేశామని చెప్పారు. ల్యాండింగ్ నిర్మాణం ఎంత బలంగా ఉందో, ఏదైనా ఢీ కొన్నప్పుడు వచ్చే బలాలు ఎలా వ్యాపిస్తాయో పరీశీలించామన్నారు. అన్ని పరీక్షల్లోనూ మంచి ఫలితాలే వచ్చాయన్నారు.
భారత దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తాము ఎయిర్ ట్యాక్సీ రూపొందించామని దుమ్ము, కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా.. విభిన్న భౌగోళిక పరిస్థితుల్లోనూ సామర్ధ్యం మేరకు పనిచేసేలా తయారు చేశామన్నారు. రెండేళ్లలోనే ఎయిర్ ట్యాక్సీ కార్యాకలాపాలు మొదలవుతాయని సీఎం చంద్రబాబు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ్రస్ట్రీలో ప్రకటించారని తెలిపారు. అందుకు అనుగుణంగానే తమ ప్రణాళికులు ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని విధాలుగా మెరుగైన ఎయిర్ ట్యాక్సీలను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చే నాటికి ఎయిర్ ట్యాక్సీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా తమ మ్యాగ్నమ్ వింగ్స్ ప్రణాళిక వేసుకుందన్నారు. అందుకు తగిన విధంగా తాము ముందుకు వెలుతున్నట్లు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
