ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి మరో షాక్..ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపిన ఫలితం…
తన వెబ్ సైట్ లో ఇండియాను తప్పడుగా చూపినందుకు ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై మరో కేసు దాఖలయింది. యూపీలోని బులంద్ షహర్ లో బజరంగ్ దళ్ నేత ఒకరు ఆయనపై పోలీసు కేసు పెట్టారు.
తన వెబ్ సైట్ లో ఇండియాను తప్పడుగా చూపినందుకు ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై మరో కేసు దాఖలయింది. యూపీలోని బులంద్ షహర్ లో బజరంగ్ దళ్ నేత ఒకరు ఆయనపై పోలీసు కేసు పెట్టారు. లడాఖ్ ను చైనాలోని భూభాగంగా, జమ్మూ కాశ్మీర్ ను మరో దేశంగా తన వెబ్ సైట్ లోని కెరీర్స్ పేజ్ లో ట్విటర్ చూపిన తీరుపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇది వక్రీకరించిన, తప్పుడు మ్యాప్ అని పలువురు ఖండించారు. ఈ సామాజిక మాధ్యమం ఇలా చూపడం ఇదే మొదటిసారి కాదని, అందువల్లే టెరిటోరియల్ అంశాల్లో స్థానిక భౌగోళిక వివరాలను సోషల్ మీడియా, టెక్ కంపెనీల ఉద్యోగులు తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలన్న గైడ్ లైన్స్ జారీ అయ్యాయని బీజేపీ ఐటీ విభాగం ఇన్-ఛార్జ్ అమిత్ మాలవీయ అన్నారు. ఇప్పటికైనా దేశంలోని చట్టాల పట్ల వీరికి సరైన అవగాహన లేదని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. (ట్విటర్ వెబ్ సైట్ నుంచి ఆ పేజ్ ను ఆ తరువాత తొలగించారు). గత ఏడాది అక్టోబరులో కూడా లేహ్ ను ట్విటర్ చైనాలోని భాగంగా చూపింది… సవరించిన తమ కొత్త నిబంధనలను ట్విటర్ పాటించడం లేదని కేంద్రం ఆగ్రహంగా ఉంది. దీనికి షో కాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మనీష్ మహేశ్వరిపై వివిధ పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి.
యూపీ లో లోనీ అనే ముస్లిం వృద్దునికి సంబంధించిన వీడియో వివాదాస్పదంగా ఉందంటూ యూపీలోని ఘజియాబాద్ పోలీసులు ఆయనపై కేసు పెట్టగా ఆయన కర్ణాటక హైకోర్టుకెక్కి.. స్వల్ప ఊరట పొందారు. ఇటీవలే ప్రభుత్వం ఈ సామాజిక మాధ్యమానికి చెందిన ఇంటర్ మీడియరీ స్టేటస్ ని తొలగించింది. అంటే తన ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేసే కంటెంట్లకు బాధ్యత ఇక నేరుగా దీనిదే అవుతుంది. దీనికి ప్రభుత్వ..న్యాయపరమైన రక్షణ ఉండదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Hero Arjun: గుడి కట్టించి భక్తి చాటుకున్న హీరో అర్జున్.. కరోనా కారణంగా వర్చువల్‌గా కుంభాభిషేకాన్ని చూడండంటూ
Banana Halwa Recipe: సింపుల్ అండ్ టేస్టీ గా అరటికాయ హల్వా తయారీ విధానం ..