BIG BREAKING: వన్ నేషన్-వన్ రేషన్ పథకాన్ని అమలు చేయండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు..
One Nation One Ration Card: రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకాన్ని వెంటనే అములు చేయాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకాన్ని వెంటనే అములు చేయాలని ఆదేశించింది. జులై 31వ తేదీ నాటికి.. ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనికి డెడ్‌లైన్ కూడా విధించింది.
జులై 31వ తేదీ నాటికి ఈ పథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు- వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్‌లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని సూచించింది.
పోర్టల్ ద్వారా నమోదు.. అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, వసల కూలీల వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జులై 31వ తేదీ నాటికి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.