Hero Arjun: గుడి కట్టించి భక్తి చాటుకున్న హీరో అర్జున్.. కరోనా కారణంగా వర్చువల్‌గా కుంభాభిషేకాన్ని చూడండంటూ
Hero Arjun: ఒకప్పుడు స్టార్ తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు నటుడు అర్జున్. తన అద్భుత నటనతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అర్జున్.. ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇదిలా ఉంటే...
Hero Arjun: ఒకప్పుడు స్టార్ తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు నటుడు అర్జున్. తన అద్భుత నటనతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అర్జున్.. ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇదిలా ఉంటే అర్జున్ తాజాగా ఒక గొప్ప కార్యకానికి శ్రీకారం చుట్టారు. అదే.. ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం. చెన్నై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తన సొంతం స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయ పనులను 15 ఏళ్ల క్రితం ప్రారంభించారు. తాజాగా నిర్మాణ పనులు పూర్తయి భక్తుల సందర్శనార్ధం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి రెండు రోజుల పాటు కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయమై ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసిన అర్జున్.. `అందరికీ నమస్కారం. చెన్నైలో 15 సంవత్సరాల క్రితం నిర్మాణ పనులు చేపట్టిన ఆంజనేయస్వామి గుడి ఇప్పుడు పూర్తయింది. జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకం నిర్వహిస్తున్నాం. స్నేహితులు, అభిమానులు, నాకు తెలిసిన వాళ్లందరినీ ఆహ్వానించాలనుకున్నా. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎవరినీ ఆహ్వానించడం లేదు. అయితే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎవరూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం యూట్యూబ్ లింక్‌ను బయోలో అందిస్తున్నాం` అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram