Papanasam 2: త‌మిళ ‘దృశ్యం’ సీక్వెల్‌లో హీరోయిన్ మార‌నుందా.. గౌత‌మి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తోన్న న‌టి ఎవ‌రో తెలుసా.?

Papanasam 2: మ‌ల‌యాళంలో వ‌చ్చిన‌ ద‌శ్యం సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. దాదాపు అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా విడుద‌లైన అన్ని చోట్ల మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ...

Papanasam 2: త‌మిళ 'దృశ్యం' సీక్వెల్‌లో హీరోయిన్ మార‌నుందా.. గౌత‌మి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తోన్న న‌టి ఎవ‌రో తెలుసా.?
Papanasam 2
Follow us

|

Updated on: Jun 29, 2021 | 12:43 PM

Papanasam 2: మ‌ల‌యాళంలో వ‌చ్చిన‌ ద‌శ్యం సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. దాదాపు అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా విడుద‌లైన అన్ని చోట్ల మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను త‌మిళంలో పాప‌నాశం పేరుతో తెర‌కెక్కించిన విష‌యం విధిత‌మే. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్, గౌత‌మి జంట‌గా న‌టించారు. ఇదిలా ఉంటే తాజాగా మ‌ల‌యాళంలో విడుద‌లైన దృశ్యం2 సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను అన్ని భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు దృశ్యం2లో మొద‌టి పార్ట్‌లో న‌టించిన వెంక‌టేశ్‌, మీనానే న‌టించారు. అయితే త‌మిళంలో మాత్రం న‌టి మారిపోనున్న‌ట్లు తెలుస్తోంది. పాప‌నాశం సినిమాలో న‌టించిన స‌మ‌యంలో క‌మ‌ల్‌, గౌత‌మి స‌హ‌జీవ‌నం చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం వారు విడిపోవ‌డంతో.. ఈ సినిమాలో న‌టించ‌డానికి గౌత‌మి ఒప్పుకోలేన‌ది స‌మాచారం. దీంతో ఈ పాత్ర కోసం న‌దియాను తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వార్త‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే దృశ్యం తొలిపార్ట్‌లో న‌దియా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

Kamal Nadiya

Kamal Nadiya

Also Read: Case On C Kalyan: మ‌రో వివాదంలో టాలీవుడ్‌ నిర్మాత సీ క‌ళ్యాణ్‌.. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు న‌మోదు.

PawanKalyan: ప‌వ‌న్‌కు కొత్త పేరు పెట్టిన బండ్ల గ‌ణేశ్‌.. ఇక‌పై త‌న అభిమాన హీరోను ఎమ‌ని పిల‌వ‌నున్నాడో తెలుసా?

Ram Gopal Varma: పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదంటూ ఆర్జీవీ ఫిలాసఫీ.. తనకు ఎలాంటి చావు కావాలో చెప్పిన వైనం