RRR Movie Latest Update: సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. రెండు పాటలు మినహా ఆర్ఆర్ఆర్ పూర్తి.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన

RRR Movie Latest Update: టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మెగా నందమూరి హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఎదురు..

RRR Movie Latest Update: సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. రెండు పాటలు మినహా ఆర్ఆర్ఆర్ పూర్తి.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
Rrr
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2021 | 12:48 PM

RRR Movie Latest Update: టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మెగా నందమూరి హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న వేళ ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్ కు చిత్ర బృందం సరికొత్త అప్డేట్ ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తిచేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని చిత్ర బృదం తెలిపింది. అంతేకాదు పోస్ట్ పొడక్షన్ వర్క్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే స్రీన్‌పై కనిపించనున్న మూవీని రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కుమురం భీంగా దర్శనమివ్వనున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ను డి. వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read: ముంబైలో పిల్లలపై సర్వే .. థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందటున్న నిపుణులు

పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదంటూ ఆర్జీవీ ఫిలాసఫీ.. తనకు ఎలాంటి చావు కావాలో చెప్పిన వైనం