AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana Halwa Recipe: సింపుల్ అండ్ టేస్టీ గా అరటికాయ హల్వా తయారీ విధానం ..

Banana Halwa Recipe: అరటికాయతో ఆంధ్రాలో ఎక్కువగా కూరలు చేస్తారు. ఇక కోనసీమలో అయితే.. అరటికాయ కుర్మాని లంక మాంసం అని ముద్దుగా పిలుచుకుంటారు...

Banana Halwa Recipe: సింపుల్ అండ్ టేస్టీ గా అరటికాయ హల్వా తయారీ విధానం ..
Banana Halwa
Surya Kala
|

Updated on: Jun 29, 2021 | 1:11 PM

Share

Banana Halwa Recipe: అరటికాయతో ఆంధ్రాలో ఎక్కువగా కూరలు చేస్తారు. ఇక కోనసీమలో అయితే.. అరటికాయ కుర్మాని లంక మాంసం అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అరటికాయతో పులుసు, వేపుడు, పచ్చడి వంటి కూరలే కాదు.. హల్వా వంటి స్వీట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు అరటికాయ హల్వా తయారీ విధానం తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు :

అరటికాయలు నెయ్యి పంచదార (బెల్లం) పాలు బాదం కిస్మిస్ జీడిపప్పు యాలకుల పొడి పచ్చికొబ్బరి లేదా కోవా

తయారీ విధానం:

ముందుగా అరటికాయల్ని కుక్కర్లో పెట్టి ఉడికించి తీసుకోవాలి అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి లోపలి గుజ్జును మెత్తగా మెదుపుకోవాలి. మూకుడులో నెయ్యి వేసి మొదట బాదం , కిస్మిస్ , జీడిపప్పు పలుకులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నెయ్యిలో ఉడికించిన అరటి కాయ గుజ్జు వేసి చిన్న మంటమీద కలర్ మారే వరకు వేయిస్తూ ఉండాలి . ఈలోపు వేయించిన పలుకులను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి . ఇప్పుడు కొన్ని పాలు ,చెక్కర లేదా బెల్లం వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి కలుపుతూ ఉండాలి .అలా అరటికాయ, పాలు మిశ్రమంనికి పచ్చికొబ్బరి లేదా కోవా వేసి ఆ మిశ్రమం గట్టిపడి మూకుడుకు అంటుకోకుండా ఉండేవరకు కలుపుతూ ఉండాలి .వేయించిన పలుకులు, యాలకుల పొడి వేసి మరోసారి కలిపి ఏదైనా ప్లేట్ లోకి తీసుకోవాలి .(ఇష్టముంటే కలర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్ లో నూనె రాసి ఆ మిశ్రమాన్ని సమానంగా పరచాలి.. చల్లారిన తర్వాత ఇష్టమున్న షేప్ లో చాకుతో గాట్లు పెట్టి తీసుకోవచ్చు .

Follow Us
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?