Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

తిరుపతి విష్ణు నివాసం ఎదుట.. వెంకన్న భక్తులు ఆందోళన నిర్వహించారు. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Tirumala Tirupati :  శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ
Follow us

|

Updated on: Dec 20, 2020 | 11:23 AM

తిరుపతి విష్ణు నివాసం ఎదుట.. వెంకన్న భక్తులు ఆందోళన నిర్వహించారు. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 24వ తేదీ దర్శనం టోకెన్లు ముందుగా ఇవ్వడంపై అధికారులపై ఫైరవుతున్నారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలంటూ వారు టీటీడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

భక్తుల ఆందోళనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. రోజువారీ పరిమితి దాటడంతో 24వ తేదీ టోకెన్లు ఇస్తున్నామని వెల్లడించింది. 21, 22, 23 తేదీల సర్వ దర్శనం టోకెన్లను ముందుగానే జారీ చేసినట్లు తెలిపింది. భక్తులను వెనక్కి పంపకూడదనే ఉద్దేశంతోనే టోకెన్లు ముందస్తుగా జారీ చేసినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.

స్థానికులకే వైకుంఠ సర్వదర్శన టోకెన్లు:

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం  జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్లు ఈసారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానికులకు మాత్రమే ప్రతిరోజూ 7వేల వరకు సర్వదర్శన టోకెన్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. టోకెన్ల కోసం స్థానిక చిరునామాతో ఉన్న ఐడీ కార్డులను వెంట తీసుకురావాలని, స్థానికేతరులు ఎవ్వరూ రావొద్దని సూచించారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, మహతి ఆడిటోరియం, ఎమ్మార్‌పల్లి దగ్గర్లోని కొత్త మార్కెట్‌, మున్సిపల్‌ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల కౌంటర్లను శనివారం ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

Also Read : Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?