ఈనెల 17నుంచి దేవీ శర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వా‌లు

భద్రా‌చల శ్రీ సీతా‌రామ చంద్ర‌స్వామి వారి దేవ‌స్థా‌నంలో ఈనెల 17నుంచి దేవీ శర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వా‌లను నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. 17న అమ్మ‌వారు ఆది‌లక్ష్మి అలం‌కా‌రంలో, 18న సంతాన లక్ష్మిగా, 19న గజ‌లక్ష్మి అలం‌కా‌రంలో, 20న ధన‌లక్ష్మిగా, 21న ధాన్య‌లక్ష్మిగా, 22న విజ‌య‌లక్ష్మిగా, 23న ఐశ్వర్య లక్ష్మిగా, 24న వీర‌లక్ష్మిగా, 25న మహా‌లక్ష్మిగా, 26న నిజ‌రూ‌పా‌లం‌కా‌రంలో దర్శ‌న‌మి‌వ్వ‌ను‌న్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా ఆంక్షలకు అనుగూణంగా భక్తులుకు అనుమతి ఇస్తున్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు, మాస్కులు ధరించినవారికి […]

ఈనెల 17నుంచి దేవీ శర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వా‌లు
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 05, 2020 | 11:53 PM

భద్రా‌చల శ్రీ సీతా‌రామ చంద్ర‌స్వామి వారి దేవ‌స్థా‌నంలో ఈనెల 17నుంచి దేవీ శర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వా‌లను నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. 17న అమ్మ‌వారు ఆది‌లక్ష్మి అలం‌కా‌రంలో, 18న సంతాన లక్ష్మిగా, 19న గజ‌లక్ష్మి అలం‌కా‌రంలో, 20న ధన‌లక్ష్మిగా, 21న ధాన్య‌లక్ష్మిగా, 22న విజ‌య‌లక్ష్మిగా, 23న ఐశ్వర్య లక్ష్మిగా, 24న వీర‌లక్ష్మిగా, 25న మహా‌లక్ష్మిగా, 26న నిజ‌రూ‌పా‌లం‌కా‌రంలో దర్శ‌న‌మి‌వ్వ‌ను‌న్నారు.

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా ఆంక్షలకు అనుగూణంగా భక్తులుకు అనుమతి ఇస్తున్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు, మాస్కులు ధరించినవారికి దర్శనం కల్పిస్తున్నారు.