వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్​కు కరోనా పాజిటివ్

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్​కు కరోనా సోకింది. ఈ నెల 2వ తేదీన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్​కు కరోనా పాజిటివ్
Ram Naramaneni

|

Oct 05, 2020 | 11:56 PM

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్​కు కరోనా సోకింది. ఈ నెల 2వ తేదీన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. కోవిడ్ సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులతో కలిసి టెస్టులు చేయించుకున్నారు. పరీక్షల్లో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మనవడికి సైతం పాజిటివ్​ అని తేలింది. చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యేనే స్వయంగా తెలిపారు. ప్రజలు కరోనా బారినపడకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.

Also Read : పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu