కరోనాతో కోలుకున్న ఢిల్లీ డిఫ్యూటీ సీఎం సిసోడియా డిశ్చార్జ్
కరోనా మహమ్మారి నుంచి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా కోలుకున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు.
కరోనా మహమ్మారి నుంచి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా కోలుకున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన సాకేత్ లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం సిసోడియాకు మళ్లీ కరోనా పరీక్షలు చేయడంతో కొవిడ్-19 నెగటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సిసోడియా సాకేత్ లోని మాక్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు. సిసోడియాకు సెప్టెంబర్ 14న కొవిడ్-19 పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కొద్దిరోజులపాటు హోమ్ ఐసోలేషన్ లో ఒంటరిగా ఉంటూ చికిత్స తీసుకున్నారు. అనంతరం సిసోడియా కాస్త అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబసభ్యలు ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఇంటకి చేరుకున్న సిసోడియాకు వారం రోజులు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు.