మళ్లీ అందుకున్న కొడాలి నాని.!

తిరుమల డిక్లరేషన్, విగ్రహాల ధ్వంసం గురించి కామెంట్లు చేసి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైసీపీనేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మళ్లీ చాకిరేవు అందుకున్నారు. దేనికీ పనికిరాని టీడీపీ నేతలు టీవీల ముందుకొచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని విమర్శించారు. దళితులకు ద్రోహం జరుగుతోందంటూ టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు […]

మళ్లీ అందుకున్న కొడాలి నాని.!
Follow us
Venkata Narayana

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 29, 2020 | 9:01 PM

తిరుమల డిక్లరేషన్, విగ్రహాల ధ్వంసం గురించి కామెంట్లు చేసి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైసీపీనేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మళ్లీ చాకిరేవు అందుకున్నారు. దేనికీ పనికిరాని టీడీపీ నేతలు టీవీల ముందుకొచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని విమర్శించారు.

దళితులకు ద్రోహం జరుగుతోందంటూ టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయని, వాస్తవానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు దర్శకత్వంలో ప్రతిరోజూ అద్భుతమైన సినిమా చూపిస్తున్నారని కొడాలినాని ఆరోపణలకు దిగారు.