వరుసకు కూతురిపై అత్యచారయత్నం.. ప్రతిఘటించడంతో భార్యతో కలిసి హత్య..
మహిళలపై దాడులు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూలన కొత్త ఉదంతం వెలుగు చూస్తుంది. కొందరు దుర్మార్గులు వావివరసలు కూడా పట్టించుకోవడం లేదు.

మహిళలపై దాడులు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూలన కొత్త ఉదంతం వెలుగు చూస్తుంది. కొందరు దుర్మార్గులు వావివరసలు కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మరో దారుణ ఘటనకు వేదికైంది. చదువుకోవడానికి నగరానికి వచ్చిన ఓ మైనర్ బాలికపై వరుసకు బాబాయి అయ్యే వక్తే అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో, భార్యతో కలిసి కడతేర్చాడు. అనంతరం ఇంట్లోనే శవాన్ని దాచి.. ఏం తెలియనట్టు డ్రామా ఆడాడు. కానీ చేసిన పాపం ఎక్కువ కాలం దాగదు..పోలీసుల ఎంక్వైరీలో నిజం తెలియడంతో చివరకు భార్యాభర్తలిద్దరూ జైల్లో చిప్పకూడు తింటున్నారు.
వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని నంద్‌నగరి ప్రాంతంలో వకీల్ పోదార్(51), అతడి భార్యలో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వకీల్ రిక్షా నడుపుతుండగా.. అతడి భార్య భిక్షాటన చేస్తూ ఉంటుంది. అయితే వకీల్ వదిన కూతురు(17) ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వచ్చి వీరి వద్దే ఉంటుంది. అయితే బాలికపై కన్నేసిన పోదార్, అనుభవించాలని డిసైడయ్యి.. భార్య లేని సమయంలో పలుమార్లు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ చదువు మధ్యలో ఆగిపోతుందేేమో అని భయంతో యువతి వాటన్నింటిని మౌనంగా భరించింది. అయితే ఓ రోజు పక్కా ప్రణాళికతో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు విషయాన్ని వకీల్ భార్యతో చెప్పింది. ఈ క్రమంలో వకీల్ కు, ఆయన భార్యకు మధ్య గొడవలు మొదలయ్యాయి. బాలికను ఇంట్లో నుంచి పంపించాలని వకీల్‌తో భార్య గొడవకు దిగింది. అయితే బయట ఎవరూ తెలియకపోవడంతో బాధితురాలు అక్కడ నుంచి వెళ్లలేదు. దీంతో ఆ బాలికను చంపితే తమ మధ్య విబేధాలు పరిష్కారమవుతాయని వకీల్, అతని భార్య ఫిక్స్ అయ్యారు. . గత నెల 23న వకీల్ ఆ బాలిక తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందింది. అనంతరం వకీల్, అతడి భార్య..డెడ్‌బాడీని బెడ్ కింద ఉండే బాక్స్ లో దాచిపెట్టారు. ఆపై బాలిక కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి..గాలింపు చేపట్టారు. అయితే వకీల్ కూడా కనిపించకపోవడంతో పోలీసులకు కాస్త తేడా కొట్టింది. ఈ క్రమంలో వకీల్ భార్యను తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. వారి ఇంటికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బీహార్ పారిపోయిన నిందితుడి పట్టుకుని ఢిల్లీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Also Read :
Breaking : చిత్తూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా, ముగ్గురు మృతి
