అశాజనకంగా దేశ ఆర్థిక వ్యవస్థః నిర్మలా సీతారామన్

మరి కొద్దిరోజులపాటు దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:40 pm, Tue, 3 November 20
అశాజనకంగా దేశ ఆర్థిక వ్యవస్థః నిర్మలా సీతారామన్

మరి కొద్దిరోజులపాటు దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రం
మౌలిక సదుపాయాలపై బలమైన దృష్టి సారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుదేలైంది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీలతో ద్వారా పరిశ్రమ రంగాన్ని గాడిలోపెట్టిందని మంత్రి నిర్మలా గుర్తు చేశారు.
అసాధారణమైన ఈ ఆర్థ సంవత్సరం ముగియడంతో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మరోసారి వెల్లడించారు. మరి కొన్ని రోజుల పాటు దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని చెప్పారు. గత రెండు రోజులుగా కొన్ని సానుకూల సాంకేతాలు వస్తున్నాయి. రెండవ ఆర్థ భాగంలో బలమైన బౌన్స్-బ్యాక్ ఆశిస్తున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయని, మార్కెట్ లో పోటీతత్వం పెరిగిందన్నారు.

జీఎస్టీ వసూళ్లు, కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాల గణాంకాలు, ఎగుమతులు, ఎఫ్‌డిఐల ప్రవాహం, విదీశీ నిల్వలు, నేటి పిఎమ్‌ఐ సంఖ్యలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని కొనసాగిస్తున్నాయి. అలాగే, స్థిరమైన సానుకూల సందేశం వస్తోంది. ఇవన్నీ నిలకడగా ఉండటం కొత్త ఆశలను చిగురిస్తున్నాయని మంత్రి నిర్మలా వివరించారు. దేశ ఆర్థిక మరింత గాడిలో పడటానికి మరి కొద్దిరోజుల సమయం పట్టే అవకాశముందని మంత్రి నిర్మలా సీతారామన్ అశాభావం వ్యక్తం చేశారు.