సినిమాలకు గుడ్‌బై .. దంగల్ నటి షాకింగ్ న్యూస్

జైరా వసీమ్.. దంగల్ మూవీలో అమీర్‌ఖాన్ చిన్న కూతురిగా నటించిన జైరా .. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో సుధీర్ఘమైన లేఖను పోస్ట్ చేసింది. ఈ లేఖ ఇప్పడు బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న జైరా ఇకపై తాను సినిమాల్లో నటించబోనని షాక్ ఇచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి ఎంటరయ్యానని. సినిమాల్లో నటించడం ద్వారా తక్కువ సమయంలోనే గొప్ప పేరు, ప్రత్యేకగుర్తింపు కూడా సంపాదించుకున్నానని తెలిపింది. […]

సినిమాలకు  గుడ్‌బై .. దంగల్ నటి షాకింగ్ న్యూస్
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2019 | 2:17 PM

జైరా వసీమ్.. దంగల్ మూవీలో అమీర్‌ఖాన్ చిన్న కూతురిగా నటించిన జైరా .. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో సుధీర్ఘమైన లేఖను పోస్ట్ చేసింది. ఈ లేఖ ఇప్పడు బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న జైరా ఇకపై తాను సినిమాల్లో నటించబోనని షాక్ ఇచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి ఎంటరయ్యానని. సినిమాల్లో నటించడం ద్వారా తక్కువ సమయంలోనే గొప్ప పేరు, ప్రత్యేకగుర్తింపు కూడా సంపాదించుకున్నానని తెలిపింది. అయినప్పటికీ ఇంత మంచి స్ధానాన్ని కల్పించిన బాలీవుడ్‌ను విడిచిపెడుతున్నట్టుగా షాకింగ్ న్యూస్ చెప్పింది.

తన మత విశ్వాసాలను గౌరవిస్తూనే సినిమా రంగానికి దూరంగా వెళ్తున్నట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైరా ఆలేఖలో పేర్కొంది. అదేవిధంగా మత విశ్వాసాలను పాటిస్తూ సినిమా రంగంలో కొనసాగలేనని కూడా తెలిపింది జైరా.

ఇదిలా ఉంటే జైరా వసీమ్ నిర్ణయాన్ని ముస్లిం మతానికి చెందిన అనేకమంది స్వాగతిస్తున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఆదర్శమంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. కశ్మీర్‌కు చెందిన జైరా వసీమ్ నటించిన దంగల్ మూవీ పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నాయి.