Viral Video: దాహం తీర్చుకుంటున్న అడవిదున్నపై మొసలి మెరుపు దాడి.. గగుర్పాటుకు గురిచేసే వీడియో వైరల్.!

ఎంతటి బలవంతుడికైనా.. ఓ బలహీనత ఉండకమానదు. అలాగే పెద్ద పెద్ద క్రూర జంతువులు కూడా అప్పుడప్పుడూ తమ వేటలో విఫలం కాక మానవు...

Viral Video: దాహం తీర్చుకుంటున్న అడవిదున్నపై మొసలి మెరుపు దాడి.. గగుర్పాటుకు గురిచేసే వీడియో వైరల్.!
Buffalo
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 22, 2021 | 1:40 PM

ఎంతటి బలవంతుడికైనా.. ఓ బలహీనత ఉండకమానదు. అలాగే పెద్ద పెద్ద క్రూర జంతువులు కూడా అప్పుడప్పుడూ తమ వేటలో విఫలం కాక మానవు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే.! నీటిలో మొసలికి తిరుగులేదు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే దాన్ని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. నీళ్లలో ఎంతటి పెద్ద జంతువులు కూడా మొసలి ముందు తలవంచాల్సిందే. అది మొసలి పవర్‌. అంతటి మొసలి తన వ్యూహంలో విఫలమైంది. నోటి దాకా అందిన ఎరను జస్ట్ మిస్ చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మేయాలో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియో ప్రకారం.. ఓ అడవి దున్న నది ఒడ్డున దాహం తీర్చుకుంటుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. మొసలి హఠాత్తుగా దానిపై మెరుపు దాడి చేసింది. అక్కడ ఉన్నది మొసలి.. ఖచ్చితంగా ఆహారం కావాల్సిందేనని అనుకోవచ్చు. కానీ అడవిదున్న తెలివిని ఉపయోగించింది. తనపైకి వస్తున్న డేంజర్‌ను పసిగట్టి ముందుగానే ఎగిరింది. మొసలి నోటికి చిక్కకుండా తప్పించుకుంది. అయితే ఆ పక్కనే చెట్టు కొమ్మ అడ్డంగా ఉండటంతో మొసలి మరోసారి అడవిదున్నను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయినా లాభం లేకపోయింది. మొసలి దవడలకు చిక్కకుండా అడవిదున్న గెంతుకుంటూ తప్పించుకుని పారిపోయింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read: 

Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!