Breaking: దేశంలో కరోనా విజృంభణ.. 9 వేలు దాటిన మరణాలు..
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,929 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,922కి చేరింది.

దేశంలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గుబులు రేపుతోంది. గత వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,929 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,922కి చేరింది. వీటిల్లో 1,49,348 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,62,379 మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 311 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 9195కి చేరింది.
ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రాల్లోనే…
- మహారాష్ట్ర – 1,04,568
- తమిళనాడు – 42,687
- ఢిల్లీ – 38,958
- గుజరాత్ – 23,038
- ఉత్తరప్రదేశ్ – 13,118
- రాజస్తాన్ – 12,401
- మధ్యప్రదేశ్ – 10,641
- వెస్ట్ బెంగాల్ – 10,698
- కర్ణాటక – 6,824
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా మరణాలు..
- మహారాష్ట్ర – 3830
- గుజరాత్ – 1448
- ఢిల్లీ – 1271
- వెస్ట్ బెంగాల్ – 463
- మధ్యప్రదేశ్ – 447
- తమిళనాడు – 397
- ఉత్తరప్రదేశ్ – 385
- రాజస్థాన్ – 282
#IndiaFightsCorona:#COVID19 India UPDATE:
▪️ Total Cases – 320922 ▪️Active Cases – 149348 ▪️Cured/Discharged- 162378 ▪️Deaths – 9195 ▪️Migrated – 1
as on June 14, 2020 till 8:00 AM pic.twitter.com/BfWdii2nZ2
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 14, 2020




