AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెహమాన్‌పై కమల్ కీలక వ్యాఖ్యలు

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌పై లోక నాయకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ లైవ్ సెషన్స్ పాల్గొన్న ఈ ఇద్దరు వారి వారి కెరీర్‌లో ఎదురైన కొన్ని ఙ్ఞాపకాలను పంచుకున్నారు.

రెహమాన్‌పై కమల్ కీలక వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 14, 2020 | 10:00 AM

Share

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌పై లోక నాయకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ లైవ్ సెషన్స్ పాల్గొన్న ఈ ఇద్దరు వారి వారి కెరీర్‌లో ఎదురైన కొన్ని ఙ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్‌ గురించి కమల్ మాట్లాడారు. ”సంగీత దర్శకుల్లో ఇళయరాజా అంటే నాకు చాలా ఇష్టం. మొదటి నుంచి ఆయన పాటలకే నేను కనెక్ట్ అయ్యా. ఆ తరువాత రెహమాన్ పాటల గొప్పదనాన్ని తెలుసుకునేందుకు నాకు రోజులు పట్టింది” అని అన్నారు.

ఇక ఇండియన్ సినిమాకు రెహమాన్ కంపోజ్ చేసిన ‘కప్పలెరి పొయచ్చు’ అనే పాట నాకు అస్సలు నచ్చలేదు. ఈ పాటపై శంకర్ దగ్గర కూడా నేను అసంతృప్తిని వ్యక్తం చేశా. అయితే ఆ పాట చిత్రీకరణ పూర్తై ఔట్‌పుట్‌ని చూసిన తరువాత నాకు చాలా బాగా నచ్చింది అని అన్నారు. కాగా గతంలో కమల్ నటించిన ఇండియన్, తెనాలి చిత్రాలకు రెహమాన్ సంగీతం అందించగా.. త్వరలో ‘తలైవాన్ ఇరుక్కిన్‌ద్రాన్’ కోసం వీరిద్దరు కలిసి పనిచేయబోతున్నారు. 1992లో వచ్చిన ‘తేవార్‌ మాగన్'(తెలుగులో క్షత్రియ పుత్రుడు) సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

Read This Story Also: చంద్రబాబు ఇంటి వద్ద పనిచేసిన కానిస్టేబుల్‌కు కరోనా

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?