Coronavirus In Maharashtra: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. మహారాష్ట్రలో కోవిడ్-19 పరిస్థితి విషమంగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 36 జిల్లాలో 34 జిల్లాలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మహారాష్ట్రలో కోవిడ్-19 విషమ పరిస్థితిపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో సమీక్షిస్తామని చెప్పారు.
మరోవైపు.. మహారాష్ట్రలో ప్రస్తుతం 15,525 కోరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 2,819 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి అయ్యారు. 617 మంది మృత్యువాత పడ్డారు.
Also Read: రైతులకు శుభవార్త.. వాళ్లందరికీ రుణ మాఫీ ..