కృష్ణా జిల్లాలో పెళ్లికి వచ్చి ఇరుక్కుపోయిన అతిథులు…వరుడికి ఎన్ని కష్టాలో..

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ తో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొంద‌రికి విచిత్రమైన క‌ష్టాలు కూడా ఎదుర‌వుతున్నాయి. స‌ర్కార్ నిబంధనలతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోవ‌డంతో..తెలియ‌ని ప్రాంతంలో ఉండ‌లేక‌..సొంతూర్ల‌కు వెళ్ల‌లేక ముప్పుతిప్ప‌లు ప‌డుతున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఓ వ్య‌క్తికి ఎదురైంది. లాక్‌డౌన్ ఊహించ‌ని కష్టాలు తెచ్చిపెట్టింది. తిరువూరుకు చెందిన యువకుడికి మార్చిలో పెళ్లైంది. ఈ కార్య‌క్ర‌మానికి విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన 14 మంది హాజరయ్యారు. రెండు […]

కృష్ణా జిల్లాలో పెళ్లికి వచ్చి ఇరుక్కుపోయిన అతిథులు...వరుడికి ఎన్ని కష్టాలో..
Follow us

|

Updated on: May 06, 2020 | 3:49 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ తో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొంద‌రికి విచిత్రమైన క‌ష్టాలు కూడా ఎదుర‌వుతున్నాయి. స‌ర్కార్ నిబంధనలతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోవ‌డంతో..తెలియ‌ని ప్రాంతంలో ఉండ‌లేక‌..సొంతూర్ల‌కు వెళ్ల‌లేక ముప్పుతిప్ప‌లు ప‌డుతున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఓ వ్య‌క్తికి ఎదురైంది. లాక్‌డౌన్ ఊహించ‌ని కష్టాలు తెచ్చిపెట్టింది. తిరువూరుకు చెందిన యువకుడికి మార్చిలో పెళ్లైంది. ఈ కార్య‌క్ర‌మానికి విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన 14 మంది హాజరయ్యారు. రెండు రోజుల తర్వాత తీరిగ్గా సొంత ఊరికి వెళదామని బంధుమిత్రులు భావించారు. కానీ సీన్ మారిపోయింది. ఇంతలోనే లాక్‌డౌన్ వచ్చి పడింది. ఈ 14మంది వరుడు ఇంట్లోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. వీరికి సౌకర్యాలు కల్పించడానికి వ‌రుడు త‌ల ప్రాణాలు తొక్కి వ‌చ్చాయి. దీంతో అతిథులతో పాటూ వరుడి కుటుంబ పెద్దలు రెవెన్యూ అధికారుల్ని కలిసి వారిని సొంతూరుకు పంపించాలని రిక్వెస్ట్ చేశారు. వారి సూచనల మేరకు టెస్టులు చేయించుకున్నారు. కానీ సొంత ఊళ్లకు పంపే దిశగా చర్యలు మాత్రం ముందుకు వెళ్ల‌లేదు. వారం రోజులుగా గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమను త్వ‌ర‌గా సొంత ఊరికి పంపాలని.. ఈ విషయంలో స‌ర్కార్ చొరవ చూపాలని విశాఖ జిల్లా వాసులు కోరుతున్నారు. అయితే సొంతంగా వారే వెహిక‌ల్ ఏర్పాటు చేసుకుని వెళ్లేందుకు ముందుకు వస్తే ప‌ర్మిషన్ ఇస్తామ‌ని తహసీల్టార్‌ అంటున్నారు. రెండు రోజుల్లో పంపించడానికి చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.