కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌‌ను నెలాఖరు దాకా మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కోవలో తాజాగా ఆర్టీసీ కండక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. ఇకపై కండక్టర్లు తప్పనిసరిగా తమ దగ్గర హ్యాండ్ శానిటైజర్లను ఉంచుకోవాలని […]

కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Mar 18, 2020 | 2:44 PM

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌‌ను నెలాఖరు దాకా మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కోవలో తాజాగా ఆర్టీసీ కండక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది.

ఇకపై కండక్టర్లు తప్పనిసరిగా తమ దగ్గర హ్యాండ్ శానిటైజర్లను ఉంచుకోవాలని తెలిపింది. బస్సులో ప్రయాణించే ప్రయాణీకులకు రెండు చుక్కలు వాళ్ల చేతులో వేసి రాసుకోమని సూచించాలని చెప్పింది. కండక్టర్లకు హ్యాండ్ శానిటైజర్లను ఆర్టీసీ యాజమాన్యమే సమకూర్చుతుంది. తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 150కు చేరుకుంటోంది.

For More News:

హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…

కరోనా ఎఫెక్ట్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…

రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..

ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!

కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!

కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..