#Chandrababu బీజేపీ మంత్రికి టీడీపీ అధినేత ప్రశంస… ఎందుకంటే?
మొన్నటి వరకు బీజేపీ మీద మండిపడుతూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇపుడు అదే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులకు కితాబునిస్తున్నారు. తాజాగా విదేశాంగ శాఖా మంత్రి జయశంకర్‌ను అభినందిస్తూ లేఖ రాశారు చంద్రబాబునాయుడు.
Chandrababu appreciated Union minister Jayashankar: మొన్నటి వరకు బీజేపీ మీద మండిపడుతూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇపుడు అదే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులకు కితాబునిస్తున్నారు. తాజాగా విదేశాంగ శాఖా మంత్రి జయశంకర్‌ను అభినందిస్తూ లేఖ రాశారు చంద్రబాబునాయుడు. కొంతకాలంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ లేఖ అనుకుంటే పొరపడినట్లే. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకోవడంలో చొరవ చూపినందుకు చంద్రబాబు కేంద్ర మంత్రిని అభినందించారు.
కౌలాలంపూర్, మలేషియాలలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు బుధవారం లేఖ రాశారు చంద్రబాబు. కౌలాలంపూర్‌లో 230 మంది, మనీలాలో 50 మంది తెలుగు వైద్య విద్యార్థులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా వారు పడుతున్న అవస్థలను టీవీ9 వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో కేంద్రం వెంటనే స్పందించింది. కేంద్ర మంత్రి జయశంకర్ ప్రత్యేకంగా ఏయిర్ ఏషియా విమానాన్ని అరేంజ్ చేసి.. కౌలాలంపూర్ నుంచి విద్యార్థులను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిలిప్పీన్స్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి వారిని విశాఖపట్నం చేర్చడానికి జయశంకర్ చేసిన కృషి గర్వకారణమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం :
కరోనా వైరస్ #covidindia చేస్తున్న విలయ తాండవంతో భూమ్మీద ప్రతీ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. తాజాగా ఫిలిప్ఫైన్స్‌లో చదువుకుంటూ… సెలవులకు ఇండియాకు బయలుదేరిన తెలుగు వైద్య విద్యార్థులు మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. 4 రోజులుగా ఎయిర్‌పోర్టులోనే గడుపుతున్న ఈ బృందంలో ఎక్కువ మంది అమ్మాయిలే వుండడం గమనార్హం.
ఫిలిప్ఫైన్స్‌లోని మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు 4 రోజుల క్రితం ఇండియాకు బయలుదేరారు. కౌలాలంపూర్‌లో ఫ్లైట్ మారాల్సి వుండగా.. అక్కడే చిక్కుకుపోయారు. భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేయడంతో తెలుగు విద్యార్థుల బృందం ఎయిర్‌పోర్టులోనే 4 రోజులుపాటు మగ్గారు. సుమారు రెండు వేల మంది దాకా తెలుగు విద్యార్థులు ఫిలిప్ఫైన్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి హాలిడేస్ ప్రకటించారు. దాంతో స్వదేశానికి వద్దామనుకున్న వీరందరికీ.. విదేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారింది.
మనీలా నుంచి కౌలాలంపూర్ చేరుకున్న తమకు ఇండియాకు వెళ్ళే ఫ్లైట్ దొరక్కపోవడంతో ఎయిర్‌పోర్టులోనే వుండిపోయామని తెలుగు విద్యార్థులు వీడియో సందేశాలను తమ పేరెంట్స్‌కు పంపారు. అవి కాస్తా మీడియాకు చేరి వార్తలుగా మారడంతో కేంద్రం స్పందించింది. తమ బృందంలో కేవలం విద్యార్థులమే లేమని.. చాలా మంది వయోజనులు కూడా వున్నారని.. వారిలో ఇమ్యూన్ పవర్ తక్కువ వుండడం వల్ల కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎలాగైనా భారత్ రప్పించాలంటూ విద్యార్థులు వేడుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాలని అర్థించారు.
అయితే.. టీవీ9లో దీనికి సంబంధించి వచ్చిన వార్తలకు కౌలాలంపూర్‌లోని ఇండియన్ అంబసీ స్పందించింది. ప్రస్తుతం మొత్తం 230 మంది విద్యార్థులు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో వున్నారని.. గుర్తించారు. వారిని ఫోన్‌లో సంప్రదించిన ఎంబసీ అధికారులు.. విషయాన్ని విదేశాంగ శాఖా మంత్రికి తెలియజేశారు. ఆయన తక్షణం స్పందించడంతో వారందరికీ విమాన టిక్కెట్లు అరేంజ్ చేశారు. మరోవైపు ఏయిర్ ఏషియా సంస్థతో మాట్లాడి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. దాంతో తెలుగు విద్యార్థులంతా వారి స్వస్థలానికి చేరేందుకు మార్గం సుగమమం అయ్యింది.