Coronavirus Outbreak: ‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి మంగళవారం నుంచి రెడ్ నోటిసులు జారీ చేస్తోంది. కుటుంబసభ్యుల అనుమతితో 'ఈ ఇంటికి రాకూడదు' అని రాసి ఉన్న నోటీసులను ఇళ్లకు అంటిస్తున్నారు.

Coronavirus Outbreak: 'ఇంటికి రావద్దు ప్లీజ్'.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2020 | 1:50 PM

Coronavirus: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి మంగళవారం నుంచి రెడ్ నోటిసులు జారీ చేస్తోంది. కుటుంబసభ్యుల అనుమతితో ‘ఈ ఇంటికి రాకూడదు.. ఆరోగ్య నిర్బంధంలో ఉన్నది’ అని రాసి ఉన్న నోటీసులను ఇళ్లకు అంటిస్తున్నారు.

అలాగే 20 వేల బృందాలు ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారికి ఇప్పటికే క్వారంటైన్ ముద్రలు వేశారు. ఇకపోతే 20 రోజులు ముందే విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న చాలామంది తమ వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఇటలీ, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్‌ నుంచి వచ్చినవారు వేలసంఖ్యలో ఉన్నారని సమాచారం. 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతుందటంతో అధికారులు డేగ కన్నుతో నిఘా వేశారు. కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరుకుంది.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!