AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 Days Lockdown: ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు అనగా ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు. ఇక మూడు వారాల పాటు కొనసాగనున్న ఈ లాక్ డౌన్‌లో ప్రజలకు ఏవి అందుబాటులో ఉంటాయో..? ఏవి ఉండవు.? అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న...

21 Days Lockdown: ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?
Ravi Kiran
|

Updated on: Mar 25, 2020 | 1:51 PM

Share

Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు అనగా ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు కలిగినా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రధాని వెల్లడించారు. కరోనా వైరస్ సంక్రమణను కట్టడి చేసేందుకు అందరూ సామజిక దూరాన్ని పాటించాల్సిదేనని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ప్రతీ నగరం, ప్రతీ ఊరు, ప్రతీ వీధి లాక్ డౌన్ అవుతుందన్నారు. లాక్ డౌన్ అనేది ప్రజలకు లక్షణ రేఖ అని.. అందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని మోదీ కోరారు.

ఇక మూడు వారాల పాటు కొనసాగనున్న ఈ లాక్ డౌన్‌లో ప్రజలకు ఏవి అందుబాటులో ఉంటాయో..? ఏవి ఉండవు.? అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే అత్యవసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా షాపులకు కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళాలి.. అందులోనూ సామజిక దూరాన్ని తప్పకుండా పాటించాలి.

మరోవైపు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కందిపప్పుతో పాటు రూ.1000 నుంచి రూ.1500 నగదు అందజేస్తున్నాయి. అటు అత్యవసరమైన ఆసుపత్రులు, మెడికల్ షాపులకు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంది. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. అటు ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే డయల్ 100ను ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో ఉండనుండగా.. ఆలయాలు, చర్చీలు, మసీదులు మూతపడతాయి.

ఈ లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులను కూడా మూసివేస్తారు. అలాగే అధిక ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. ప్రజలు మాత్రం తమకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వాధికారులు కోరుతున్నారు.

లాక్ డౌన్‌లో ఓపెన్ చేసి ఉండేవి…

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు..
  • హాస్పిటల్స్, మెడికల్ షాపులు..
  • వెజిటెబుల్, ఫ్రూట్స్, మిల్క్, చికెన్ అండ్ మటన్ షాపులు
  • బ్యాంక్, ఇన్సూరెన్స్ కార్యాలయాలు, ఏటీఎంలు
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
  • ఇంటర్నెట్ సర్వీసులు
  • ఈ కామర్స్ ద్వారా ఫుడ్, మెడికల్ వస్తువుల డెలివరీ చేసే సంస్థలు
  • పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సంస్థలు

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!