9 మ్యాచ్‌ల్లోనే ముంచేసిన రూ. 9 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ 2025కి ముందే ఇలా షాకిచ్చాడేంటి భయ్యా

IPL 2025: ఐపీఎల్ 2025 కోసం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, IPL 2025కి ముందు ఈ యువ ఆటగాడు BBLలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ప్రస్తుత బీబీఎల్ సీజన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 100 పరుగులు కూడా చేయలేదు.

9 మ్యాచ్‌ల్లోనే ముంచేసిన రూ. 9 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ 2025కి ముందే ఇలా షాకిచ్చాడేంటి భయ్యా
Jake Fraser Mcgurk
Follow us
Venkata Chari

|

Updated on: Jan 14, 2025 | 5:14 PM

Jake Fraser Mcgurk: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ (BBL) జరుగుతోంది. ఈ ప్రసిద్ధ టీ-20 లీగ్‌లో ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు కనిపిస్తున్నారు. బీబీఎల్ ఈ సీజన్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు త్వరలో జరగబోతున్నాయి. అయినప్పటికీ ఆస్ట్రేలియా 22 ఏళ్ల తుఫాను బ్యాట్స్‌మెన్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ బ్యాట్ ఇప్పటి వరకు గర్జించలేదు. అతను ఇంతకుముందు తన బలమైన ఆటతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. కానీ, ప్రస్తుత బీబీఎల్ సీజన్‌లో, జాక్ ఫ్రేజర్ ఘోరంగా విఫలమవుతున్నాడు. బీబీఎల్ వైఫల్యంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై పడవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 కోసం డీసీ అతడిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

9 మ్యాచ్‌ల్లో 100 పరుగులు కూడా చేయలే..

ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ మెక్‌గర్క్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. అతను బీబీఎల్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. 9 మ్యాచ్‌ల్లో 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. బీబీఎల్ ఇటీవలి సీజన్‌లో, అతని సగటు 10.33 మాత్రమే. అతని అత్యధిక స్కోరు 26 పరుగులు. మెక్‌గర్క్ పేరుతో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో సహా 11 బౌండరీలు మాత్రమే ఉన్నాయి.

ఐపీఎల్ 2025 కోసం రూ. 9 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..

బీబీఎల్‌లో విఫలమైన తర్వాత, మెక్‌గర్క్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడవలసి ఉంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద టీ-20 లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేసే బాధ్యత మెక్‌గర్క్‌పై ఉంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి భారీ మొత్తం ఇచ్చింది. మెక్‌గర్క్ ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, ఐపీఎల్ 2025 వేలానికి ముందు అతడిని జట్టు రిటైన్ చేయలేదు. అయితే, వేలం సమయంలో, DC ఆర్టీఎం కార్డును ఉపయోగించి అతనిని చేర్చుకుంది. ఢిల్లీ ఈ యువ బ్యాట్స్‌మన్‌ను రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో కూడా ఫ్రేజర్ ఇదే జోరు కొనసాగితే ఢిల్లీకి భారీ నష్టం తప్పకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలు మోయాల్సి ఉంటుంది.

ఐపీఎల్ 2024లో సంచలనం..

ఐపీఎల్ 2024లో ఫ్రేజర్ సంచలనం సృష్టించాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్ కోసం తన బలమైన ప్రదర్శనతో తన మొదటి IPL సీజన్‌లోనే బీభత్సం చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 9 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో 330 పరుగులు నమోదయ్యాయి. 32 ఫోర్లు, 28 సిక్సర్లు బాదాడు. ఈ యువ బ్యాట్స్‌మెన్ అత్యధిక స్కోరు 84 పరుగులు.

మరిన్ని క్రీడా వార్తల కో సం ఇక్కడ క్లిక్ చేయండి..