Virat Kohli: వామ్మో.. ఆమె కోసం ఏకంగా బీసీసీఐ రూల్‌నే మార్చేసిన కోహ్లీ.. తక్కువోడేం కాదు భయ్యో
Virat Kohli: 2014 ఆస్ట్రేలియన్ టూర్ సమయంలో, విరాట్ కోహ్లీ కోసం బీసీసీఐ తన నియమాలలో ఒకదాన్ని ఉల్లంఘించవలసి వచ్చింది. నిజానికి ఆ సమయంలో ఆటగాళ్ల భార్యలు మాత్రమే విదేశీ పర్యటనల్లో వారితో పాటు వెళ్లేందుకు అనుమతించేవారు. గర్ల్ ఫ్రెండ్స్‌ని తమతోపాటు తీసుకెళ్లేందుకు ఛాన్స్ లేదు. అయితే విరాట్-రవి శాస్త్రి ఈ రూల్ ఎలా మార్చారో ఇప్పుడు తెలుసుకుందాం..
Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆటగాళ్ల కుటుంబాలకు సంబంధించి బీసీసీఐ ఓ రూల్ పాస్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ పర్యటనలు లేదా 45 రోజుల కంటే ఎక్కువ టోర్నమెంట్ల సమయంలో, ఆటగాళ్ల భార్యలు గరిష్టంగా 14 రోజులు మాత్రమే వారితో ఉండగలరుని ఇందులో సారాంశం. అయితే, దీని కంటే తక్కువ వ్యవధి గల విదేశీ పర్యటనలలో, ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో 7 రోజులు మాత్రమే ఉండగలరు. అయితే, 10 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన విరాట్ కోహ్లి తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను ఆస్ట్రేలియా తీసుకొచ్చేందుకు ఏం చేశాడో తెలుసా?
అనుష్కను ఆస్ట్రేలియాకు తీసుకొస్తానాని శాస్త్రిని కోరిన కోహ్లీ..
విదేశీ పర్యటనల్లో ఆటగాళ్లతో పాటు వారి భార్యలను మాత్రమే బీసీసీఐ అనుమతిస్తోంది. అయితే, ఇప్పుడు బీసీసీఐ దానిని కూడా తగ్గించింది. అయితే, 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ అనుష్క శర్మను కూడా ఆస్ట్రేలియాకు ఆహ్వానించాడు. ఆ సమయంలో వారిద్దరూ ఒకరికొకరు డేటింగ్‌లో ఉన్నారు. 2014లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ఆ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, అతని సహకారంతోనే ఇలా సాధ్యమైంది.
రవిశాస్త్రి విరాట్ కోహ్లీతోచాలా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. శాస్త్రి ఇటీవల ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ, ‘నేను 2015లో కోచ్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ వివాహం చేసుకోలేదు. అనుష్క శర్మతో డేటింగ్‌లో ఉన్నాడు. విరాట్ వచ్చి భార్యను మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది, నేను, నా స్నేహితురాలిని ఇక్కడికి తీసుకురావచ్చా అంటూ అడిగాడు. బోర్డు అనుమతి ఇవ్వడం లేదని విరాట్ అన్నాడు. అప్పుడు నేను కాల్ చేశాను. ఆ తర్వాతే ఆమె (అనుష్క శర్మ) మాతో చేరింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
గర్ల్‌ఫ్రెండ్‌ని వెంట తీసుకురావాలనే నిబంధన విరాట్ కెప్టెన్సీలో వచ్చిందే..
ఈ ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్ర సింగ్ ధోని అకస్మాత్తుగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. అతని సారథ్యంలోనే ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లను వెంట తీసుకురావాలనే నిబంధన వచ్చింది. ఆ తర్వాత, అనుష్క శర్మ చాలా సందర్భాలలో విరాట్ కోహ్లీతో కనిపించింది. తర్వాత, ఇతర ఆటగాళ్లు కూడా తమ స్నేహితురాళ్లను వెంట తీసుకెళ్లడం ప్రారంభించారు.
మరిన్ని క్రీడా వార్తల కో సం ఇక్కడ క్లిక్ చేయండి..