ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అదే సమయంలో రికవరీ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6780 కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అదే సమయంలో రికవరీ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6780 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,96,609కు చేరింది. ఇందులో 84,777 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,09,100 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 82 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2732కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 7,866 మంది కరోనాను జయించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 535, చిత్తూరులో 458, తూర్పు గోదావరిలో 911, గుంటూరులో 776, కడపలో523, కృష్ణాలో 135, కర్నూలులో 372, నెల్లూరులో 481, ప్రకాశంలో 357, శ్రీకాకుళంలో 527, విశాఖలో 519, విజయనగరంలో 462, పశ్చిమ గోదావరిలో 724 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో గత ఐదు రోజులుగా 44,257 మంది కరోనాను జయించి ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read:
కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!
తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!
‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్
ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!
ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..




