వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత సంతతి మహిళా క్రికెట్ అంతర్జాతీయ టీ20లో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. జర్మనీ విమెన్స్ టీమ్ కెప్టెన్ అనురాధ దొడ్డబళ్ళాపూర్ శుక్రవారం ఆస్ట్రియాతో జరిగిన..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
Follow us

|

Updated on: Aug 16, 2020 | 12:54 AM

Anuradha Doddaballapur Creates History: భారత సంతతి మహిళా క్రికెట్ అంతర్జాతీయ టీ20లో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. జర్మనీ విమెన్స్ టీమ్ కెప్టెన్ అనురాధ దొడ్డబళ్ళాపూర్ శుక్రవారం ఆస్ట్రియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. దీనితో అనురాధ ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.

199 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రియాను 33 ఏళ్ల అనురాధ బెంబేలేత్తించింది. తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రియాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో అనురాధ కేవలం ఒక్క పరుగు మాత్రమే సమర్పించుకుని ఓవరాల్‌గా ఐదు వికెట్లు పడగొట్టింది. లక్ష్య చేధనలో ఆస్ట్రియా 20 ఓవర్లలో 61/9 స్కోర్ చేయగలిగింది. దానితో జర్మనీ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?