Watch Video: సీఎం రేవంత్ రెడ్డిని ఈసీ బర్తరఫ్ చేయాలి.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్
సీఎం రేవంత్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ వెంటనే బర్తరఫ్ చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి కేంద్ర హోం మంత్రిపై ఫేక్ వీడియోలు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ వెంటనే బర్తరఫ్ చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి కేంద్ర హోం మంత్రిపై ఫేక్ వీడియోలు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అర్వింద్.. కాంగ్రెస్ నాయకుల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే అబద్ధం ఉందన్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీకి డజన్ సీట్లు కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు అర్వింద్.
సీఎం రేవంత్ రెడ్డి తన హోదాని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. దేశ అభ్యున్నతి కోసం మోదీప్రభుత్వం ఎన్నో పథకాలు అమలుచేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డుతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో సీఎం రేవంత్ రోజుకో ప్రకటన చేస్తున్నారన్నారు ఎంపీ అర్వింద్.