4 రోజుల్లో 1800 కి.మీ.. అయినా పోలీసులకు దొరికిపోయాడు..
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ తాజాగా అరెస్టయ్యారు. అయితే దీనిని తప్పించుకోవడానికి సినిమా లెవెల్‌లో అడ్వెంచర్ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. పోలీసులు ట్రాకింగ్ ముందు ఆయన ఆటలు సాగలేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సాహిల్.. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ తాజాగా అరెస్టయ్యారు. అయితే దీనిని తప్పించుకోవడానికి సినిమా లెవెల్‌లో అడ్వెంచర్ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. పోలీసులు ట్రాకింగ్ ముందు ఆయన ఆటలు సాగలేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సాహిల్.. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దాంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రాలు దాటడం మొదలుపెట్టారు. మొదట మహారాష్ట్ర నుంచి గోవా, అక్కడి నుంచి కర్ణాటకకు వెళ్లారు. మళ్లీ తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషాలు మార్చారు. ముఖాన్ని స్కార్ఫ్‌తో దాచుకునేవారు. తర్వాత ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ పారిపోవాలని ప్లాన్ చేశారు. రాత్రి సమయంలో ఆ రాష్ట్రంవైపు ప్రయాణించడానికి సాహిల్ డ్రైవర్ అంగీకరించలేదు. అయినా తాను రోడ్డు మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే జాడ పసిగట్టిన పోలీసులు.. ఛత్తీస్‌గఢ్ చేరుకున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఐదు రాష్ట్రాల మీదుగా సుమారు 1,800 కి.మీ. ప్రయాణించినా, అరెస్టు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోటి పూతేగా అని లైట్ తీసుకోవద్దు.. ఆలస్యం చేస్తే డేంజర్
నమ్మలేని నిజం.. మనిషి ఒంట్లో బంగారం
బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మే నెలలో సెలవులే సెలవులు !!
కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. అలర్టయిన లేడీ కానిస్టేబుల్..
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

