”నో అద‌ర్ వ‌ర్క్‌.. ఓన్లీ వ‌ర్క్‌వుట్” ముమ్ముట్టి లుక్ వైర‌ల్

ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్ముట్టి త‌న ఫిట్‌నెస్‌పై పూర్తిగా ఏకాగ్ర‌త పెట్టిన‌ట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఇంట్లోని జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ.. బిజీగా గ‌డుపుతున్నారాయ‌న‌. ఈ మేర‌కు ఆదివారం వ‌ర్క్‌వుట్ సెష‌న్‌కు సంబంధించిన ఫొటోలు..

  • Tv9 Telugu
  • Publish Date - 6:01 pm, Mon, 17 August 20
''నో అద‌ర్ వ‌ర్క్‌.. ఓన్లీ వ‌ర్క్‌వుట్'' ముమ్ముట్టి లుక్ వైర‌ల్

క‌రోనా లాక్‌డౌన్ సెల‌బ్రిటీలకు బాగా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ షూటింగుల‌తో బిజీగా గ‌డిపే న‌టీ న‌టుల‌కు ఈ క‌రోనా వ‌ల్ల ఇంటివ‌ద్ద‌నే ఫ్యామిలీతో గ‌డిపే ఛాన్స్ దొరికింది. అంతే కాకుండా ముఖ్యంగా వారి ఫిట్‌నెస్‌పై ఎక్కువ‌గా ఇంట్రెస్ట్ పెట్టారు. ఈ దొరికిన స‌మ‌యాన్ని వారికి న‌చ్చిన ప‌నులు చేస్తూ, ప‌లు విష‌యాలు నేర్చుకుంటూ ఫిట్‌నెస్‌పై మ‌రింత ఫోక‌స్ చేస్తూ స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక అటే సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో కూడా ట‌చ్‌లో ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్ముట్టి త‌న ఫిట్‌నెస్‌పై పూర్తిగా ఏకాగ్ర‌త పెట్టిన‌ట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఇంట్లోని జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ.. బిజీగా గ‌డుపుతున్నారాయ‌న‌. ఈ మేర‌కు ఆదివారం వ‌ర్క్‌వుట్ సెష‌న్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు ముమ్ముట్టి.

”వ‌ర్క్ ఎట్ హోం.. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం.. హోం వ‌ర్క్‌.. నో అద‌ర్ వ‌ర్క్.. సో వ‌ర్క్‌వుట్’. అనే క్యాప్ష‌న్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న జిమ్ వ‌ర్క్‌వుట్ ఫొటోల‌ను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్స్ ఆయ‌న ఫొటోల‌కు కామెంట్స్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం