బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని చారిత్రక క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం క్రాఫోర్ట్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన..
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని చారిత్రక క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం క్రాఫోర్ట్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా ఈ మార్కెట్లో అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.
Read More:
ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు.. బస్సుల్లో వైఎస్సార్ జనతా బజార్లు