ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనాతో పోరాడుతూ ఎస్పీబీ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు..

The Latest Health Condition of SPB : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనాతో పోరాడుతూ ఎస్పీబీ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు బాలు కుమారుడు ఎస్పీ చరణ్ అభిమానులతో పంచుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిన్న ఏవిధంగానైతే నిలకడగా ఉందో సోమవారం కూడా అలాగే ఉంది అని చరణ్ ప్రకటించారు. అయితే, ఎలాంటి ఇతర ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారని అన్నారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. నాన్నగారు త్వరగా కోలుకోవాలని అభిమానులు చేసే ప్రార్థనలు, చూపిస్తున్న ప్రేమతో ఆయన తిరిగి సాధారణ స్థితికి వస్తారని… దేవుడు, అభిమానులు నిజంగా గొప్పవారు అంటూ వీడియో సందేశం విడుదల చేశారు చరణ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అగ్ర నటులు రజనీకాంత్, మోహన్‌బాబు, కమల్‌హాసన్ తదితరులు ఆకాంక్షించారు.
‘‘నాన్నగారి ఆరోగ్యం నిన్న ఏవిధంగానైతే నిలకడగా ఉందో సోమవారం కూడా అలాగే ఉంది. అయితే, ఎలాంటి ఇతర ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాన్నగారు త్వరగా కోలుకోవాలని మీరు చేసే ప్రార్థనలు, చూపిస్తున్న ప్రేమతో ఆయన తిరిగి సాధారణ స్థితికి వస్తారు. దేవుడు, అభిమానులు నిజంగా గొప్పవారు’’ అంటూ ఇన్స్టాగ్రామ్‌లో వీడియోను విడుదల చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అగ్ర నటులు రజనీకాంత్, మోహన్‌బాబు, కమల్‌హాసన్ తదితరులు ఆకాంక్షించారు.
#Spb heathupdate 17/8/2020 https://t.co/mKyJG5NdHf
— S. P. Charan (@charanproducer) August 17, 2020




