భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

భారత యువతను టార్గెట్‌గా చేసుకుని చైనా మరో కుట్ర పన్నింది. ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ల ఉచ్చులోకి గేమ్స్ ఆడే యువతను దింపుతూ వారి వద్ద ఉన్న డబ్బును కొల్లగొడుతూ...

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..
Follow us

|

Updated on: Aug 16, 2020 | 12:54 AM

Online Gaming Mafia: భారత యువతను టార్గెట్‌గా చేసుకుని చైనా మరో కుట్ర పన్నింది. ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ల ఉచ్చులోకి గేమ్స్ ఆడే యువతను దింపుతూ వారి వద్ద ఉన్న డబ్బును కొల్లగొడుతూ తమ దేశానికి తరలించాలని చైనా కంపెనీలు పెద్ద పధకాన్ని రచించాయి. గుట్టు చప్పుడు కాకుండా కలర్ ప్రిడిక్షన్ పేరుతో వల విసురుతూ.. అమాయకులను నిలువు దోపిడీ చేయడం ప్రారంభించాయి. ఎంతలా అంటే ఓ రెండు కంపెనీలకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి ఈ ఏడాది ఏకంగా రూ. 1100 కోట్లు లావాదేవీలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నగరానికి చెందిన ఇద్దరు బాధితులు ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్‌, మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ బాధితుడు జూలై 27న రూ. 97 వేలు పోగొట్టుకోగా.. కంచన్ బాగ్‌కు చెందిన మరో బాధితుడు రెండు రోజుల వ్యవధిలో ఆన్లైన్ గేమింగ్‌లో ఏకంగా రూ. 1.63 లక్షలు పోగొట్టుకున్నాడు. దీనితో తెలంగాణ గేమింగ్ చట్టం, భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధితుల డబ్బులు బదిలీ చేసిన ఖాతాలపై దృష్టి సారించారు. ఈ గేమింగ్ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో ప్రారంభమై అక్కడ నుంచే టెలిగ్రామ్‌లోకి.. ఆ తర్వాత ఒక్క రోజు మాత్రమే పని చేసే గేమింగ్ సైట్లపైకి మారుతుందని గుర్తించారు.

ఈ డ్రాగన్ కంపెనీల భారీ వ్యూహాన్ని చేధించిన హైదరాబాద్ పోలీసులు… ఒక చైనా దేశీయుడితో సహా ముగ్గురు అధికారులను ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ సంస్థల్లో భారతీయులు కూడా పని చేస్తున్నారని.. ఢిల్లీ కేంద్రంగా ఈ బిజినెస్ కొనసాగుతోందని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇలాంటి కంపెనీల మూలాలకు వెళ్లి దర్యాప్తు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?