బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో.. లష్కర్ టాప్ కమాండర్ హతం!
భద్రతా దళాలు సోమవారం ప్రతీకారం తీర్చుకున్నాయి. బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఎ తొయిబాకు చెందిన టాప్ కమాండర్ సజ్జద్ అలియాస్ హైదర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. సజ్జాద్‌ను హతమార్చడం

భద్రతా దళాలు సోమవారం ప్రతీకారం తీర్చుకున్నాయి. బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఎ తొయిబాకు చెందిన టాప్ కమాండర్ సజ్జద్ అలియాస్ హైదర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. సజ్జాద్‌ను హతమార్చడం భద్రతాదళాలకు గొప్ప విజయమని చెప్పారు. బారాముల్లాలోని క్రీరి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకూ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది కోసం వేట కొనసాగుతోంది. ఘటనా స్థలం నుంచి ఓ ఏకే 47 రైఫిల్, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు.
[svt-event date=”17/08/2020,6:04PM” class=”svt-cd-green” ]
#KreeriEncounterUpdate:01 more #terrorist killed (Total 02). #Operation going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/C5seCmYikt
— Kashmir Zone Police (@KashmirPolice) August 17, 2020
[/svt-event]



