Rahul gandhi: కరోనా మరణాలపై కేంద్రం చెబుతున్నది పచ్చి అబద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణ
దేశంలో కరోనా మరణాల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. కరోనా మరణాలపై కేంద్రం వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో నమోదవుతున్న కరోనా మరణాల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా మరణాలపై కేంద్రం వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవానికి పూర్తి బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోదీయేనని ధ్వజమెత్తారు. కరోనా గురించి ప్రధాని మోదీ సరిగ్గా అర్థం చేసుకోనందుకు దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం వ్యవహారతీరు మారాలని, అబద్ధాలతో గడిపేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పే విషయంలో ఆర్ఎస్ఎస్ విధానాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కరోనా విషయంలో వాస్తవ వివరాలును మీడియాకు చెప్పాలని శుక్రవారం జూమ్ ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
సరిదిద్దుకోమంటే మాపై ఎదురుదాడి చేశారు..
ఇది రాజకీయ అంశం కాదని, దేశ ప్రజల ప్రాణాల రక్షణకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. కోవిడ్-19 విషయంలో రాబోయే విపత్తు గురించి తాను, మరికొందరు ముందే హెచ్చరించామని…అయితే ప్రభుత్వం తమపై ఎదురుదాడికి దిగిందన్నారు. కేంద్రం సరైన ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే…దేశంలో నేటి పరిస్థితులు నెలకొనేవి కావని అభిప్రాయపడ్డారు. కాలం గడిచే కొద్ది కొవిడ్ మరింత ఉధృతం అవుతుందని…దీన్ని అర్థం చేసుకోవడంలో ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారని ఆరోపించారు.
వ్యాక్సినేషన్‌తోనే కోవిడ్‌కు పరిష్కారం..
వ్యాక్సినేషన్ ఒక్కటే కోవిడ్ సమస్యకు శాశ్విత పరిష్కారమన్న రాహుల్ గాంధీ…లాక్‌డౌన్లు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీని ప్రధాని మోదీ ఎదుటే తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు. దేశ జనాభాలో ఇప్పటి వరకు కేవలం 3 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇచ్చారని…కరోనా వైరస్ లోపలికి వచ్చేందుకు తలుపులు తెరిచామని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్‌తో వ్యాపారం చేస్తున్నారని, ఒక్కో వ్యాక్సిన్‌కు ఒక్కో ధరను నిర్ణయిస్తున్నారని విమర్శించారు. ఇదే రీతిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తే 2024 మే నాటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఎద్దేవా చేశారు. అప్పటికి దేశం చాలా వేవ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
Video: దడ పుట్టిస్తున్న కొత్త రకం ఫంగస్…Watch Live
ఇవి కూడా చదవండి…
కరోనాకు విరుగుడు అంటూ పామును నిమిలిని తిన్న వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
తెలంగాణకు మేఘా చేయూత… బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న థాయిలాండ్ ఆక్సిజన్ ట్యాంకర్లు