ఆర్టీసీని నష్టపరిచారు.. వారిని క్షమించేది లేదు: సీఎం కేసీఆర్
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎ కేసీఆర్ మరోసారి శనివారం అధికారులతో సమీక్షించారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేది లేదంటూ మరోసారి తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా మూడు రోజుల్లో వందశాతం బస్సులు రోడ్డెక్కాలని అధికారులను ఆదేశించారు. సమ్మెలో పాల్గొనని సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని కూడా అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో బస్సులను పునురుద్ధరించాలని, బస్సులు నడిచే విధంగా తగిన సిబ్బందిని వెంటనే విధులకు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ యూనియన్ల నేతల మాటలు […]
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎ కేసీఆర్ మరోసారి శనివారం అధికారులతో సమీక్షించారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేది లేదంటూ మరోసారి తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా మూడు రోజుల్లో వందశాతం బస్సులు రోడ్డెక్కాలని అధికారులను ఆదేశించారు. సమ్మెలో పాల్గొనని సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని కూడా అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో బస్సులను పునురుద్ధరించాలని, బస్సులు నడిచే విధంగా తగిన సిబ్బందిని వెంటనే విధులకు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ యూనియన్ల నేతల మాటలు నమ్మి 48 వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారని, ఇలాంటి వారితో చర్చలకు తావులేదన్నారు. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టిన వారిని క్షమించలేమన్నారు. చట్టవిరుద్ధంగా సాగిస్తున్న సమ్మెపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఆర్టీసీ యూనియన్లకు మద్దతిస్తున్న పార్టీలను ప్రజలు చీత్కరించుకునే రోజుల దగ్గర్లోనే ఉందన్నారు సీఎం కేసీఆర్.
శనివారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్, సీనియర్ అధికారులు సునీల్‌శర్మ, నర్సింగరావు, సందీప్‌సుల్తానియా, ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్లు పాండురంగ నాయక్, సి.రమేష్, మమతాప్రసాద్, డీటీసీలు ప్రవీణ్‌రావు, పాపారావు, ఆర్టీసీ ఈడీలు టివిరావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
విధ్వంసాలకు పాల్పడితే పెట్టండి
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిపి మహేందర్ రెడ్డి కి ఫోన్ చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి , నిఘా పెట్టాలన్నారు. బస్ స్టాండ్ , డిపోల వద్ద మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని సీఎం చూచించారు. ఇంటెలిజెన్స్ పోలీసులను కూడా ఉపయోగించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి,కోర్టుకు పంపాలని ఆదేశించారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు.