గత 50 ఏళ్లుగా ప్రజా పోరాటాలు… వారితో మాకు లింకేంటీ?
గత యాభై ఏళ్లుగా ఎన్నో ప్రజల సమస్యలపై పోరాడిన తమను నిషేధిత సంఘాలుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొనడంపై ఆయా ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మానవహక్కుల వేదిక, పౌర హక్కుల సంఘం, విరసం, కులనిర్మూలన పోరాట సమితి, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, టీపీఎఫ్, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్ధి వేదిక, ఆదివాసీ విద్యార్ధి సంఘం, తుడుందెబ్బతో సహా మొత్తం 23 ప్రజా సంఘాల నేతలు ఉమ్మడిగా […]
గత యాభై ఏళ్లుగా ఎన్నో ప్రజల సమస్యలపై పోరాడిన తమను నిషేధిత సంఘాలుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొనడంపై ఆయా ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మానవహక్కుల వేదిక, పౌర హక్కుల సంఘం, విరసం, కులనిర్మూలన పోరాట సమితి, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, టీపీఎఫ్, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్ధి వేదిక, ఆదివాసీ విద్యార్ధి సంఘం, తుడుందెబ్బతో సహా మొత్తం 23 ప్రజా సంఘాల నేతలు ఉమ్మడిగా సమావేశమై ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు . సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలు రాజకీయ నేత మాట్లాడినట్టుగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్త చేశారు. గత యాభై ఏళ్లుగా ప్రజలతో మమేకమై, రచయితలుగా, కళాకారులుగా, హక్కుల కార్యకర్తలుగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులుగా, మహిళా సంఘాల ప్రతినిధులుగా ఎన్నో పోరాటాలు చేశామని వారు వివరించారు. ప్రజల పక్షాన నిలిచిన తమను అణిచివేసే దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజల తరపున నిలిచి నిజాయితీగా పోరాడుతున్న తమ గొంతును నొక్కేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందని, తమ సంఘాలను మావోయిస్టుల పేరుతో భయపెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వారు ఆరోపించారు.