లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు

25 Maoists surrender : మావోయిస్టుల ప్రాభవం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్ లో లోంగుబాట్లు పెరుగుతున్నాయి. దంతెవాడ జిల్లా అటవి ప్రాంతంను రెడ్ కారిడార్ మార్చుకున్న మావోయిస్టులకు అక్కడి స్థానికుల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ఈ మధ్య కాలం లొంగిపోతున్నవారి సంఖ్య అంటున్నారు పోలీసులు. ఇప్పుడు తాజాగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో రూ.1 లక్ష నగదు రివార్డు ఉన్న మావోయిస్టులు న‌లుగురు ఉన్నారని దంతెవాడ పోలీస్  అధికారి […]

లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 10, 2020 | 9:25 AM

25 Maoists surrender : మావోయిస్టుల ప్రాభవం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్ లో లోంగుబాట్లు పెరుగుతున్నాయి. దంతెవాడ జిల్లా అటవి ప్రాంతంను రెడ్ కారిడార్ మార్చుకున్న మావోయిస్టులకు అక్కడి స్థానికుల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ఈ మధ్య కాలం లొంగిపోతున్నవారి సంఖ్య అంటున్నారు పోలీసులు. ఇప్పుడు తాజాగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

లొంగిపోయినవారిలో రూ.1 లక్ష నగదు రివార్డు ఉన్న మావోయిస్టులు న‌లుగురు ఉన్నారని దంతెవాడ పోలీస్  అధికారి ఒకరు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు నిర్ణ‌యించిన పునరావాస చర్యలు ప్ర‌భావితం చేయ‌డంతోనే వారు లొంగిపోయిన‌ట్లు  తెలుస్తోంది.

కౌకొండ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ అధికారుల ఎదుట నలుగురు మహిళా మావోయిస్టులతోపాటు మొత్తం 25 మంది లొంగిపోయారు. వీరితోపాటు ప్రకాశ్ కర్తామీ అలియాస్ పండు , హద్మీ అనే మరో మావోయిస్టు జంట దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు చాలా ఆపరేషన్లలో పాల్గొన్నట్లు పోలీస్ అధికారులు నిర్ధారించారు.