ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 90 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ప్రకటించింది.

ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!
Follow us

|

Updated on: Jul 10, 2020 | 11:29 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువ అవుతుండగా.. మరణాలు 21 వేలకు పైగా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 90 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ప్రకటించింది. అలాగే 80 శాతం కరోనా మరణాలు 32 జిల్లాల్లోనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ మందిలో 1453 మందికి కరోనా సోకుతుండగా.. దేశంలో ఆ సంఖ్య 538గా ఉందని తెలిపింది.

కాగా, దేశవ్యాప్తంగా ఉన్న హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాల గురించి పరిశీలిస్తే.. ఇప్పటివరకు దేశంలో 3,77,737 ఐసోలేషన్ పడకలు, 39,820 ఐసీయూ బెడ్స్, 20,047 వెంటిలేటర్లతో పాటు 1,42,415 ఆక్సిజన్ సపోర్ట్ కలిగిన బెడ్స్ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అటు 21.3 కోట్ల ఎన్95 మాస్కులు, 1.2 కోట్ల పీపీఈ కిట్లు, 6.12 కోట్ల హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్స్ పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..