తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ మాదిరిగానే తెలంగాణలోనూ 30 శాతం ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!
Follow us

|

Updated on: Jul 10, 2020 | 9:24 AM

కరోనా వైరస్ నేపధ్యంలో 9 నుంచి 12 తరగతుల వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 2020-21 విద్యా సంవత్సరానికి 30 శాతం సిలబస్ కుదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సీబీఎస్ఈ 30 శాతం సిలబస్‌ను కుదించినట్లుగానే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సిలబస్ సీబీఎస్ఈలో, రాష్ట్రంలో ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి ఆయా గ్రూపుల్లో సీబీఎస్ఈ తొలగించే పాఠ్యాంశాలను రాష్ట్రంలోనూ తొలగించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా తొలగించాల్సిన పాఠాలపై కసరత్తు ప్రారంభించారు. ఇక ఆర్ట్స్ గ్రూపుల్లో ఏ సిలబస్‌ను తగ్గించాలన్న దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read:

ఏపీలో ఆ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం..!

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు ఎప్పుడంటే..?

కరోనా మందు రెమ్‌డెసివర్‌ కావాలా..? నమోదు చేసుకోండిలా..