తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు ఎప్పుడంటే..!

డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలపై తాజాగా యూజీసీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలు, కాలేజీలలో చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆఖరి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ పరీక్షలను సెప్టెంబర్‌లోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో […]

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు ఎప్పుడంటే..!
Follow us

|

Updated on: Jul 08, 2020 | 5:37 PM

డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలపై తాజాగా యూజీసీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలు, కాలేజీలలో చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆఖరి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ పరీక్షలను సెప్టెంబర్‌లోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి.

దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షలు ఆగష్టు రెండోవారంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగష్టులో ఎగ్జామ్స్ పూర్తి చేసి.. సెప్టెంబర్‌లో ఫలితాలు విడుదల చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి యూనివర్సిటీల కన్వీనర్‌లతో సమావేశమై పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్ధులకు మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ తెలిపింది. ఫస్ట్ ఇయర్, సెకండియర్ విధ్యార్ధులను ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయవచ్చునని స్పష్టం చేసింది.