ఉద్యోగులకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త‌…!

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ త‌న ఉద్యోగుల‌కు తీపికబురు చెప్పింది. కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోన్న స‌మ‌యంలో కూడా బ్యాంక్‌కు వెళ్లి సేవ‌లు అందించిన వారికి వేతనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం.

ఉద్యోగులకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త‌...!
Follow us

|

Updated on: Jul 08, 2020 | 3:02 PM

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ.. త‌న ఉద్యోగుల‌కు తీపికబురు చెప్పింది. కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోన్న స‌మ‌యంలో కూడా బ్యాంక్‌కు వెళ్లి సేవ‌లు అందించిన ఉద్యోగుల‌కు వేతనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. వారికి 8 శాతం వేతన పెంపు ప్ర‌తిపాద‌న‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఏకంగా 80 వేల మందికి పైగా ఉద్యోగులు ల‌బ్ది పొంద‌నున్నారు. బ్యాంక్ సిబ్బందిలో 80 శాతం మంది వ‌ర‌కు కోవిడ్-19 స‌మ‌యంలో విధులు నిర్వ‌ర్తించిన‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి. కోవిడ్ 19 సమయంలో ఎంప్లాయిస్ స‌ర్వీసుకు గుర్తింపుగా బ్యాంక్ వేతన పెంపు నిర్ణయాన్ని తీసుకుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ వేతన పెంపు నిర్ణయం 2020-21 ఆర్థిక సంవత్సరానికి అమ‌లు కానుంది. వేతన పెంపు జూలై నుంచి లెక్క‌లోకి వ‌స్తుంది. అయితే బ్యాంక్ ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చెయ్య‌లేదు. ఈ అంశంపై మెయిల్ పంపిన‌ప్ప‌టికీ స‌మాధానం రాలేదు. కరోనా వైరస్ సంక్షోభంతో చాలా కంపెనీలు ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లుకుతున్నాయి. మ‌రికొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగులకు వేతనం పెంచుతుండటం గొప్ప విష‌యంగానే చెప్పుకోవాలి.