Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఆ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. విజయవాడ, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలతో పాటు మండలాలు, గ్రామాల్లోకి కూడా వైరస్ విస్తరిస్తుండటం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దీనితో ఇప్పటికే ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా ప్రదేశాల్లో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు దాకా […]

ఏపీలో ఆ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 08, 2020 | 6:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. విజయవాడ, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలతో పాటు మండలాలు, గ్రామాల్లోకి కూడా వైరస్ విస్తరిస్తుండటం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దీనితో ఇప్పటికే ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా ప్రదేశాల్లో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో లాక్‌డౌన్‌ అమలు చేశారు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మద్యం షాపులు, కూరగాయాల షాపులు తెరవాలని సూచించారు. ఆ తర్వాత కేవలం మెడికల్ షాపులు, అత్యవసరమైన వాటికి మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఈ నిబంధనలు అమలాపురం, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నారు. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ఏడు మండలాల్లో కఠినంగా లాక్ డౌన్ విధించనున్నారు. అత్యవసరం తప్పితే గానీ.. ప్రజలు బయటికి రాకుడదని అధికారులు సూచిస్తున్నారు.

ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు